అనుమానంతో దారుణం..భార్యను కత్తితో హత్య చేసిన భర్త..

0
127

అక్రమ సంబంధాల కారణంగా చాలా మంది జీవితాలు సర్వ నాశనం అవుతున్నాయి. కొందరు మృగాలు అనుమానంతో విచక్షణా రహితంగా ప్రవర్తిస్తూ క్షణికావేశంలోనే ప్రాణాలను బలికొంటున్నారు. తాజాగా అనుమానంతో ఓ భర్త తన భార్యను హత్య చేసిన దారుణమైన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఇందుర్తి గ్రామానికి చెందిన శిరీష అనే మహిళ అంగన్వాడి సెంటర్ లో ఆయమ్మగా పనిచేస్తూ జీవనాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో నేడు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శిరీష అంగన్వాడి సెంటర్ లో జాతీయ జెండా ఎత్తింది. అనంతరం శిరీష భర్త ప్రవీణ్‌ కోపంతో  శిరీషను అంగన్వాడి సెంటర్ నుండి ఇంటికి లాక్కెళ్లాడు.

ఆ తరువాత ప్రవీణ్ కనకం శిరీష ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కత్తితో  పొడిచి చంపి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.