పబ్జీ చిచ్చు..కత్తితో పొడిచి చంపిన ఫ్రెండ్స్

0
90

పబ్​జీ ఇప్పటికే ఎందరినో బలి తీసుకుంది. ఈ ఆన్​లైన్ గేమ్ కు యువత బానిసలుగా మారుతున్నారు. దీని ప్రభావంతో విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ఠాణెలోని వార్తక్ నగర్​లో దారుణ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే..సాయిల్ జాదవ్ అనే వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి తరచుగా పబ్​జీ ఆడేవాడు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ నలుగురు కలిసి పబ్​జీ ఆడుకున్నారు. ఈ క్రమంలోనే వీరి మధ్య గొడవ మొదలయింది. ముగ్గురు స్నేహితులు కలిసి సాయిల్ జాదవ్​పై దాడి చేసి కత్తితో పొడిచి చంపేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.