Breaking news- రైలు కింద పడి పంచాయతీ కమిషనర్ ఆత్మహత్య

0
124

ఏపీ: గత కొంతకాలంగా పుట్టపర్తి నగర్ పంచాయితీ కమిషనర్ గా పని చేస్తున్న మునికుమార్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కడప రాయచోటి రైల్వే గేట్ సమీపంలో చోటు చేసుకోగా..సమాచారం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో కమలాపురంలో పని చేసిన మునికుమార్ ప్రస్తుతం పుట్టపర్తి నగర్ పంచాయితీ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.