జంబల్ పూర్ నగర్ కు చెందిన సుమితా అనే యువతి డిగ్రి చదివిన సమయంలో ఆశారాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది .ఇద్దరూ తమ తల్లిదండ్రులకి ప్రేమ విషయం చెప్పారు. అబ్బాయి కుటుంబం ఒప్పుకుంది కాని అమ్మాయి కుటుంబం మాత్రం ఒప్పుకోలేదు. దీంతో అతను మీ పేరెంట్స్ ని ఒప్పించు పెళ్లి చేసుకుందాం అన్నాడు. కాని వారి పేరెంట్స్ మాత్రం పెళ్లికి ససేమిరా అన్నారు.
చివరకు కొన్ని నెలలు అంతా సైలెంట్ గా ఉన్నారు. కూతురు మారింది అని భావించారు. ఈ సమయంలో పేరెంట్స్ కి షాకింగ్ వార్త చెప్పింది. చివరకు తాను తల్లిని అయ్యాను అని చెప్పడంతో ఆ తండ్రి రామ్ దేవ్ షాక్ అయ్యాడు. గుండె పగిలి కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు కాని అతను మరణించాడు.
దీంతో ఆమె చేసిన పనికి తండ్రి చనిపోయాడు అని కుటుంబం ఆమెపై కేసు పెట్టింది. చివరకు గర్భవతి అయితే మా పెరెంట్స్ పెళ్లికి ఒప్పుకుంటారు అని ఆమె చెప్పడంతో ఇలాంటి పని చేశాను అని ప్రియుడు చెప్పాడు. దీనిపై కేసు నమోదు అయింది. ఇంతకాలం గారాబంగా పెంచిన కుమార్తె చేసిన పనికి ఆ తండ్రి తట్టుకోలేక ఇలా ప్రాణాలు కోల్పోయాడు.