పాల్వంచ ఘటన..వెలుగులోకి సంచలన సెల్ఫీ వీడియో

0
93

తెలంగాణ: పాల్వంచ కుటుంబ ఆత్మహత్య ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యే వనమా కుమారుడు వనమా రాఘవ అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవల పాల్వంచలో రామక్రిష్ట తన భార్య ఇద్దరు కుమార్తెలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ లెటర్ లో తన చావుకు కారణం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవ అంటూ ఆరోపణలు చేశాడు. తాజాగా ఆత్మహత్యకు ముందు రామక్రిష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఇందులో సంచలన విషయాలను వెల్లడించాడు మృతుడు రామక్రిష్ణ.

https://www.youtube.com/watch?v=CIXrwUiZPFk&feature=emb_title

రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయన్నాడు. ఇలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఎదగనివ్వద్దని అన్నాడు. అప్పు చేసిన డబ్బు అడిగినా.. ఇచ్చే వాడికి కానీ.. నాభార్య కావాలని అడిగాడిని సంచలన విషయాలను వెల్లడించాడు. ఏ భర్త వినకూడని మాటలను రాఘవ అడిగాడని… నీ భార్యను హైదరాబాద్ తీసుకువస్తే నీ సమస్య పరిష్కారం అవుతుందని అన్నాడని ఆరోపించాడు. నేను ఒక్కడినే చనిపోతే.. నాభార్య పిల్లలను వదిలిపెట్టరు అని వీడియోలో తెలిపాడు. రాజకీయ, ఆర్థిక బలంతో.. నా బలహీనతలతో ఇబ్బందులకు గురి చేశాడని రామక్రిష్ణ ఆరోపించాడు. అప్పుల్లో ఉన్నానని తెలిసినా.. నా తల్లి, అక్క కక్ష సాధించారని వెల్లడించారు.

సోమవారం రామకృష్ణ తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి తానూ నిప్పటించుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే సజీవదహనం కాగా రామకృష్ణ చిన్న కూతురు చికిత్స పొందుతూ బుధవారం మరణించింది.