పేటీఎం CEO విజయ్ అరెస్ట్..విడుదల..అసలేం జరిగిందంటే?

0
80

పేటీఎంకు మరో బిగ్ షాక్​ తగిలింది. ర్యాష్​ డ్రైవింగ్​ కేసులో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్​ శేఖర్​ శర్మను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన విజయ్​.. అదే రోజు బెయిల్​పై విడుదల కావడం విశేషం. దక్షిణ దిల్లీ మాలవియా నగర్​ ప్రాంతంలో ఫిబ్రవరి 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దీనిపై కానిస్టేబుల్ మాట్లాడతూ.. ‘‘మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు ట్రాఫిక్ జామ్ ఉంది..ఆ సమయంలో ఓ కారు స్పీడ్ గా వచ్చి నేనే నడిపే డిసిపి వాహనాన్ని డ్యాష్ ఇచ్చి అంతే స్పీడ్ తో దూసుకుంటూ ముందుకు వెళ్లిపోయిది. ఇదే విషయాన్ని డీసీపీ జైకర్ కు తెలియజేశాం అని తెలిపాడు.  కారు నెంబర్ ఆధారంగా ఢీకొట్టిన కారు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.

దీంతో ఐపీసీ సెక్షన్ 279 కింద విజయ్ శర్మను పోలీసులు అదే రోజు అరెస్ట్ చేశారు. బెయిల్ పై వెంటనే విడుదల చేశారు. పోలీసుల దర్యాప్తులో..ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనం గుర్తించబడింది. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మను గుర్తించిన తరువాత ఫిబ్రవరి 22 న అరెస్టు చేసి, అదే రోజు బెయిల్‌పై విడుదల చేయబడిందని తెలిపాడు.