పోలీస్ స్టేషన్ కు పెన్సిల్ పంచాయితీ (వీడియో)

Pencil panchayat to police station (video)

0
99

న్యాయం కోసం రెండో తరగతి విద్యార్థి ఏకంగా పోలీసు స్టేషన్ మెట్లెక్కాడు. ఇంతకీ ఆ పిల్లాడికి జరిగిన అన్యాయం ఏంటి? ఆ విద్యార్థికి స్టేషన్ కు వెళ్లేంత అన్యాయం ఏం జరిగింది? అసలు ఈ విచిత్రమైన ఘటన ఎక్కడ జరిగిందా అని అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా పెద కడుబూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రోజూ తన బ్యాగులోని పెన్సిల్ ను దొంగతనం చేస్తున్నాడని హనుమంతు అనే బుడ్డోడు మరో విద్యార్థి హనుమంతుపై తరచూ గొడవ పడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పిన పెన్సిల్ దొంగిలించడం ఆపడం లేదంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు.

ఆ ఇద్దరు హనుమంతులతో మరో ఇద్దరు విద్యార్థులు స్టేషన్ కు వెళ్లారు. పెన్సిల్ దొంగతనం చేస్తున్న విద్యార్థిపై కేసు పెట్టాలని బుడ్డోడు పట్టు పట్టాడు. పోలీసులు సర్ది చెప్పినా వినలేదు. కేసు పెట్టాలని పట్టుబట్టాడు చిన్నోడి తీరుతో పోలీసులు నవ్వుకున్నారు. సరే కేసు పెడతాం మంచిగా చందువుకోండని పోలీసులు విద్యార్థులకు చెప్పారు.

చిన్నారుల పెన్సిల్ పంచాయతీ కింది లింక్ ఓపెన్ చేసి చూడండి.

https://www.facebook.com/NewsAPTS/videos/668532800799641