దారుణం వారి కుమార్తెని ప్రేమించాడని మర్మాంగం కోసేశారు

మర్మాంగం కోసి చిత్రహింసలు పెట్టారు

0
129

బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. తమ కుమార్తెని ఓ యువకుడు ప్రేమించాడు. దీంతో అతన్ని పట్టుకుని అమ్మాయి కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెట్టారు. చివరకు అతడి మర్మాంగాన్ని కోసేశారు. స్థానికంగా కలకలం రేపింది ఈ ఘటన. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.

ముజఫర్పూర్ జిల్లా
రేపురా రామ్పుర్షా గ్రామానికి చెందిన 19 ఏళ్ల సౌరభ్రాజ్ సోర్బారా గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇక ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకి తెలిసింది. ఇక కోపంతో అతనిని యువతి ఇంటికి పిలిచారు. దీంతో బంధువులు అందరూ కలిసి అతనిపై దాడి చేశారు.

మర్మాంగం కోసి చిత్రహింసలు పెట్టారు. చివరకు దగ్గరల్లో ఆస్పత్రికి చేర్చారు. చికిత్స పొందుతూ సౌరభ్ మృతి చెందాడు. ఈ విషయం అబ్బాయి కుటుంబ సభ్యులకి తెలిసింది. వెంటనే వారు అమ్మాయి కుటుంబంపై దాడి చేశారు. మృతదేహానికి నిందితుల ఇంటి వద్దే అంత్యక్రియలు నిర్వహించారు.