Flash News: డ్రగ్స్ కేసులో వైద్యుడి అరెస్ట్

0
82

డ్రగ్స్ కేసులో ప్రముఖ వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..డాక్టర్‌ పృధ్వీ ఐదేళ్లుగా రాజాంలో వైద్యసేవలు అందిస్తున్నారు. కొన్నాళ్లు ఓ ప్రముఖ వైద్యుడి ఆస్పత్రిలో విధులు నిర్వహించేవారు. గత ఏడాది రాజాంలో సొంతంగా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించి.. అందులోనే సేవలు కొనసాగిస్తున్నారు. దీంతో పాటు రాజాం రోటరీ క్లబ్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

డ్రగ్స్ కేసులో విశాఖలో పట్టుబడ్డ ముఠాతో డాక్టర్‌కు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానించారు. హైదరాబాద్‌కు చెందిన మాలవ్య అనే యువతికి డాక్టర్ పృథ్వి అకౌంట్ నుంచి నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. ఇదే కేసులో హైదరాబాద్‌కు చెందిన గీత, మాలవ్య, విశాఖకు చెందిన హేమంత్ అరెస్ట్ అయ్యారు. హేమంత్‌కు డాక్టర్ పృథ్విరాజ్ స్నేహితుడు. కాగా పృథ్విరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.