ప్లీజ్ పీరియడ్ వచ్చిన మహిళలను అలా చూడకండి – ప్రాణం పోయింది

A woman with rituals lost her life.

0
171

ఈ సృష్టికి మూలం స్త్రీ అయితే ప్రతి మహిళలకు పిరియడ్స్ అనేది కామన్, గతంలో దీనిని మూఢాచారంగా చూసేవారు కానీ ఈ నవీన యుగంలో చాలా మంది ఈ ఆచారాలకు గుడ్ బై చెప్పారు. అయినా ఇంకా కొన్ని గ్రామాలు , తండాల్లో ఈ ఆచారం పాటిస్తూ ఆ మూడు రోజులు మహిళలను మైల అని దూరంగా ఉంచుతారు.

అంతేనా వారి కోసం కొన్ని గుడిసెలు ఉంటాయి నేలపై పడుకోబెడతారు, ఎంతో దారుణంగా ఇంకా కొందరు దీనిని పాటిస్తున్నారు. దయచేసి ఇలాంటి వాటిని ఇకనైనా మానుకోండి, ఇలాంటి ఆచారాలతో ఓ మహిళ తన ప్రాణం కోల్పోయింది.

ఆదిలాబాద్ లోని ధరమడుగు గ్రామంలో ఓ మహిళలకు రుతు క్రమం వచ్చింది. వారి ఆచారం ప్రకారం రుతు క్రమం వచ్చిన మహిళ ఇంటి బయటే ఉండాలి. దీంతో ఆమె బయట నేలపై పడుకుంది.. రాత్రి 11 గంటల సమయంలో నిద్రలో ఉన్న ఆమెని పాము కాటు వేసింది.. వెంటనే భర్త ఆమెని ఆస్పత్రికి తీసుకువెళ్లాడు కానీ అప్పటికే ఆమె పరిస్దితి విషమించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

దయచేసి ఇలాంటి ఆచారాటు పాటించి మహిళలను ఇబ్బంది పెట్టకండి. ఆమె ఇంటిలో పడుకుని ఉంటే ప్రాణాలు దక్కేవి పాపం.