విశాఖలో కలకలం రేపిన ఎమ్మార్వో రమణయ్య(MRO Ramanaiah) హత్య కేసు నిందితుడిని గుర్తించామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్(CP Ravi Shankar) తెలిపారు. నిందితుడి కోసం ప్రత్యేక బందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విమానం ఎక్కి పారిపోయాడని.. టికెట్ బుక్ చేసిన ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పది ప్రత్యేక బందాలు ఏర్పాటు చేశామన్నారు. నిందితుడిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? అనేది దర్యాప్తు చేస్తున్నామన్నారు. త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు.
కాగా విశాఖ(Visakha) కొమ్మాదిలో తహసీల్దార్ రమణయ్య శుక్రవారం రాత్రి దారుణహత్యకు గురయ్యారు. నగరంలోని చరణ్ క్యాజిల్ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి దాడి చేశారు. వాచ్‌మెన్ కేకలు వేయడంతో నిందితుడు పరారు అయ్యాడు. ఎమ్మార్వోను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ తహసీల్దార్ మృతి చెందాడు. ఈ హత్యను ఏపీ రెవెన్యూ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. నిందితులను పట్టుకుని ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మార్వో(MRO Ramanaiah) కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.