గుట్టుగా గంజాయి అమ్మకం..రంగంలోకి అధికారులు..ముగ్గురు అరెస్ట్

0
99

ఏపీలో గంజాయి కలకలం రేపింది. విశాఖలోని కొత్తపాలెంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అమ్మకానికి పెట్టారు ముగ్గురు వ్యక్తులు. ఈ ఘటనపై డిప్యూటీ కమీషనర్ బాబ్జీ రావు, అసిస్టెంట్ కమీషనర్ రామచంద్రరావు ఆదేశాల నేపథ్యంలో..ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరిడెంట్ శ్రీనాధుడు ఇన్సఫెక్టర్లు, నమ్మి గణేష్, అప్పలరాజు, ప్రసాద్ ఎస్సై, ఆమాన్ రావు, ఖగేశ్ లు పక్కా సమాచారంతో నిఘా పెట్టారు.

గంజాయి అమ్మకానికి పెట్టిన ముగ్గురు వ్యక్తులను సెబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 216 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారివద్ద ఉన్న ఒక స్కూటీ , ఆటోను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ గంజాయిని బుడ్డేడి శ్రీమంజునాధ్ అనే వ్యక్తి ఏజెన్సీలో గంజాయి తెచ్చి మరో ఇద్దరు వ్యక్తులైన మువ్వల ప్రసాద్, దుక్కేరీ డేవిడ్ రాజు సహయంతో అమ్మకానికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.