లేడీ కానిస్టేబుల్ కోసం సీఐ, కానిస్టేబుల్ తన్నులాట!

0
113

ఓ చాక్లెట్ కోసం ఇద్దరు చిన్న పిల్లలు గొడవ పడ్డట్లుగా ప్రవర్తించారు ఇద్దరు పోలీసులు. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే..విధుల్లో ఉన్నామనే కనీసం బాధ్యత లేకుండా బుద్ధి తక్కువగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే..ఓ మహిళా కానిస్టేబుల్ కోసం సీఐ, కానిస్టేబుళ్లు గొడవ పడిన ఘటన ఏపీలోని భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది.

ఓ మహిళా కానిస్టేబుల్ ను రాజేష్ అనే కానిస్టేబుల్ బైకుపై లిఫ్ట్ ఇస్తుండడాన్ని సిఐ కృష్ణభగవాన్ తట్టుకోలేకపోయాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం చెలరేగి అది కాస్త ఎక్కువ కావడంతో ఒకరిపై ఒకరు చేయి చేసుకొని మరింత కొట్టుకున్నారు. అక్కడున్న పోలీసులు ఎంత ఆపాలని ప్రయత్నించినా కూడా ఎలాంటి లాభమూ లేకుండా పోయింది. ఈ విషయం పోలీసుల ద్వారా అధికారులకు తెలియడంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు విచారణ చేసి సిఐని వీఆర్ కు పంపారు.