మహిళలు చిన్నారులు గార్భా ఆడుతున్నారు.. ఇంతలో అక్కడకు వచ్చిన కొందరు ఆకతాయిల వారిపై రాళ్లు రువ్వారు. పోలీసులు రంగ ప్రవేశం చేయటంతో అడ్డంగా బుక్కై.. చావు దెబ్బలు తిన్నారు. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే దసరా సందర్భంగా చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి గుజరాత్‌లోని ఖేడ్ జిల్లాలో గార్భా ఆడుతున్నారు. అక్కడ ఉన్న కొందరు ఆకతాయిలు గార్భా ఆడుతున్నవారిపై రాళ్లు రువ్వారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆకతాయిలను పట్టుకొని, అందరూ చూస్తుంగానే కరెంటు స్తంభానికి కట్టి చితక్కొట్టేశారు. ఆకతాయిలను కొడుతున్న సమయంలో పోలీసులు ఎవరూ యూనిఫాంలో లేరు. 43 మందిపై కేసులు నమోదు చేసి.. 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ బాజ్‌పేయి వెల్లడించారు. హిందూయేతర వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వేడుకల్లో ప్రవేశించి సమస్య సృష్టించినట్లు ఖేడా ఎస్పీ రాజేశ్ గధియా వివరించారు. మత కల్లోలాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని.. పండుగలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అన్ని మతాల వారు సహకరించాలని పోలీసు అధికారులు ప్రజలను కోరుతున్నారు.
#Gujarat Police taking action on a group of men for pelting stones on women & girls playing Garba.
Now waiting for @RanaAyyub to write a sob story in @washingtonpost about how minorities are being targeted in India.
Don't be surprised if she demands the right to pelt stones!!! pic.twitter.com/nSCYCA0qbp
— Priti Gandhi – प्रीति गांधी (@MrsGandhi) October 4, 2022