Flash News : భూ వివాదంలో నిర్మాత సి.కల్యాణ్ మీద పోలీసు కేసు

0
104

టాలీవుడ్ లో బడా నిర్మాతగా పేరుగాంచిన సి.కల్యాణ్ భూవివాదంలో ఇరుక్కున్నారు. ఆయన మీద పోలీసు కేస్ బుక్కైంది. వివరాలు ఇవీ..

షేక్ పేట భూవివాదంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిల్మ్ ప్రొడ్యూసర్ సి.కల్యాణ్ మీద అలాగే మరో ముగ్గురైనా కేసు నమోదైంది. అమెరికాలో డాక్టర్ గా పనిచేస్తున్న స్వరూప్ సోదరుడి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. స్వరూప్ 1985లో షేక్ పేటలో ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ నుంచి భూమి కొనుగోలు చేశాడు. 2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడు. నారాయణమూర్తి ఆ ల్యాండ్ లో ఆర్గానిక్ స్టోర్ నడుపుతున్నాడు.

నిన్న సాయంత్రం నిర్మాత సి.కల్యాణ్ పేరు చెప్పుకుని షరూఫ్, శ్రీకాంత్, తేజస్వి అనే వ్యక్తులు ఆర్గానికి స్టోర్ కు తాళం వేశారు. సి.కల్యాణ్ మనుషులం అని వారు చెప్పారని తెలుస్తోంది. దీంతో స్వరూప్ సోదరుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.