మాజీ ఐపిఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై పోలీస్ కేసు : సెక్షన్లు ఇవే

0
87

మాజీ ఐపిఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కోర్టు డైరెక్షన్ మేరకు కరీంనగర్ త్రి టౌన్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఒక బిజెపి నేత కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఆదేశాల మేరకు కరీంనగర్ త్రి టౌన్ పోలీసులు క్రైమ్ నెం: 144/2021, సెక్షన్లు153-A, 295-A, 298 r/w 34 IPC క్రింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇందులో Ipc Sec 153 a మత ప్రార్థనలు, మతం పై జనాలని పోగేసి దూషించడం ఆందోళన కలిగించడం.

Ipc Sec 295a మతాల మనోభావాలు దెబ్బ తీసేలా కించపరిచేలా మాట్లాడడం.

IPC 298r/w 34 మతాలను కించపరిచేలా మాట్లాడటంపై కేసులు నమోదు చేస్తారు. అయితే దీనిపై విచారణ జరిగిన తర్వాత ఏరకమైన చర్యలు ఉంటానేది చెప్పలేం.