Flash News : జబర్దస్త్ కమేడియన్ హైపర్ ఆదిపై ఫిర్యాదు

0
133

ఈటివిలో కమేడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది చిక్కుల్లో పడ్డారు. ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ వివరాలు…

 బుల్లి తెర నటుడు, జబర్దస్త్ టీం లీడర్ హైపర్ ఆదిపై ఎల్ బి నగర్ ఎసిపి శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు.

 నిన్న ఆదివారం నాడు ఈటివిలో ప్రసారమైన శ్రీదేవి డ్రామ కంపెనీ ప్రోగ్రాంలో చేసిన స్కిట్ తెలంగాణ బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాష, యాసను కించపరిచేలా ఉందని వారు ఆరోపలు చేస్తూ ఫిర్యాదు చేశారు.

జబర్దస్త్ హైపర్ ఆది, స్క్రిప్ట్ రైటర్, మల్లెమాల ప్రొడక్షన్స్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు విద్యార్థి నేతలు. దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.