Breaking News: కిడ్నాపర్లను 5 గంటల్లో ఛేదించిన పోలీసులు

Police crack down on kidnappers in 5 hours

0
96

హైదరాబాద్: నారాయణగూడలో కలకలం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ ను పోలీసులు చేధించారు. కేవలం 5 గంటల్లోనే అతని ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దోబీఘాట్, అగపురా, నాంపల్లికి చెందిన షేక్ గౌస్ పాషా రియల్ ఎస్టేట్ వ్యాపారి.

షేక్ గౌస్ పాషా…నారాయణ గూడలోని ఈడెన్ గార్డెన్ లో ఓ పెళ్లికి హాజరైన వెళ్తున్న సమయంలో రాత్రి గంట 12.10ని లకు గుర్తు తెలియని ఆగంతకులు ఓ కారులో ఎక్కించుకొని కిడ్నప్ చేసినట్లు 3.30 గంటలకు సన్నిహితుడు ఫిర్యాదు చేశాడు. దీనితో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు పోలీసులు. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో 25 లక్షల నుండి 50 లక్షల లావాదేవీల్లో ఏర్పడిన వివాదంతో కిడ్నప్ కు పాల్పడ్డట్లు తెలుస్తుంది. మొయినాబాద్ పరిసర ప్రాంతాలలో గౌస్ ని గుర్తించిన పోలీసులు.

గత కొంతకాలంగా తప్పించుకొని తిరుగుతున్న గౌస్ పాషాను నిన్న ఓ పెళ్లిలో ఉన్నాడని ఓ సన్నిహితుడు ఇచ్చిన సమాచారంతో అతనిని పట్టుకొని మోహినాబాద్కు తరలించారు. కేసు నమోదయింది అని తెలుసుకున్న వారు గౌస్ పాషా కూతురికి ఫోన్ చేపించి ఒక గంటలో వస్తానని చెప్పించారు. తన అల్లుడు ఇచ్చిన సమాచారంతో నెట్వేర్క్ సహాయంతో మోహినా బాద్ లో ఓ షెడ్లో ఉన్నట్లు గుర్తించాము. తమ డబ్బుల కోసం విచారిస్తున్న త్వరణంలో తమ పోలీసులు వాళ్ళను అదుపులోకి తీసుకున్నాము. గౌస్ పాషాకు ఎలాంటి గాయాలు, దెబ్బలు లేవు. గౌస్ ని అదుపులోకి తీసుకుని నారాయణ గూడ పోలీసు స్టేషన్ కు తరలించాము కంప్లైంట్ అయిన 5 గంటల్లో కేసు ఛేదించాము. నిందితులు 5 గురిని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నాం.