ఎక్ నాథ్ రెడ్డిపై గృహ హింస కేసు నమోదు చేసిన పోలీసులు..కారణం ఇదే..!

0
94

ప్రముఖ మిఠాయి దుకాణం పుల్లారెడ్డి మనవడు ఎక్ నాథ్ రెడ్డిపై పంజాగుట్ట పోలీసులు గృహ హింస కేసు నమోదు చేసారు. కారణం ఏంటంటే..ఎక్ నాథ్ రెడ్డి తన భార్యను ఇంట్లోనే ఉంచి ఆమెను బయటకు రాకుండా ఉండేందుకు పాకట్బండిగా అన్ని సన్నాహాలు చేసి తాను ఇంట్లో ఉన్న గదికి ఒక అడ్డు గోడను రాత్రికి రాత్రే నిర్మించి అతను ఇంటికి తాళం వేసి పారిపోయినట్టు అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గతకొంతకాలంగా పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కుటుంబంలో చిన్న చిన్న కలహాలు తలెతున్నట్టు ఆమె, తన తండ్రి తో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇంట్లో నుండి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు 100 నంబర్ కు కాల్ చేసి బయటకు వచ్చినట్టు తెలియజేసింది. బాధితురాలి పిర్యాదు మేరకు వరకట్న వేధింపుల చట్టంతో పాటు గృహ హింస కేసు కూడా నమోదు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.