కాంగ్రెస్ అధ్యక్షుడిపై పోలీసులు కేసు నమోదు..కారణం ఏంటో తెలుసా?

0
88

నారాయణపేట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అదే పార్టీ  మహిళా పోలీసులకు పిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానట్టు నమ్మించి ఈ అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత మహిళా వెల్లడించింది. శివకుమార్​ రెడ్డి తన భార్య మూడేళ్ల కంటే జీవించదని నమ్మించి తన మెడలో పసుపుతాడు కట్టి కామవాంఛ తీర్చుకున్నాడని ఈ మేరకు పోలీసులకు పిర్యాదు చేసింది.

శివకుమార్‌రెడ్డి వీడియోలు, ఫోటోలు తీసి ఆన్‌లైన్‌లో పెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు పంజాగుట్ట పీఎస్​లో పిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు శివకుమార్​ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.