హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ పోలీసుల వాహన తనిఖీల్లో..ఓ ద్విచక్రవాహనంపై ఉన్న చలాన్లు పోలీసులనే షాక్ కు గురి చేశాయి. అబిడ్స్ లో స్కేటింగ్ కోచ్ గా పనిచేస్తున్న జనైద్ యాక్టివాపై…107చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 35 వేల 835 రూపాయలు చెల్లించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
అబిడ్స్ సిటీ గూగుల్ భవనంలో స్కేటింగ్ కోచ్‌గా పని చేస్తున్న జునైద్ టీఎస్ 09ఎఫ్ 3792 నెంబర్ గల హోండా యాక్టివాను వెంటనే పోలీసులు సీజ్ చేశారు. నాలుగేళ్లుగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తుండటంతో అతనిపై కేసు నమోదు చేశారు.
ఇటీవల కాలంలో పోలీసులు పెండింగ్ చలాన్లపై ప్రత్యేక దృష్టిసారించారు. కూడళ్లలో వచ్చే పోయే ప్రతీ వాహనాన్ని పరిశీలిస్తున్నారు. అనుమానం ఉంటే వెంటనే ఆపి చలానాలు తనిఖీ చేస్తున్నారు. వీలైనంత వరకు అక్కడికక్కడే చలానా వసూలు చేస్తున్నారు. వేయి రూపాయల కంటే ఎక్కువ బాకీ ఉంటే వాహనదారులు ఖచ్చితంగా మీ-సేవలో కానీ, ఆన్లైన్లో కానీ పేమెంట్ చేసినట్లుగా చూపిన తరువాతే వాహనం అప్పగిస్తున్నారు.