ఏపీ మంత్రి బంధువునంటూ 11 మందిని పెళ్లాడిన ప్రబుద్ధుడు..

0
54

ఇటీవల కాలంలో పెళ్లి పేరుతో అనేక మోసాలు వెలుగులోకి రాగా..తాజాగా హైదరాబాద్‌లో మరో నిత్యపెళ్లి కొడుకు ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ప్రబుద్ధుడి మోసం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

వివరాల్లోకి వెళితే..ఏపీలోని గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన అడపా శివ శంకర్‌ ఏకంగా 11 మందిని పెళ్లిచేసుకున్నాడు. వివాహ పరిచయ వేదిక ద్వారా పెళ్లి జరిగి విడాకులైన యువతులను ఎంచుకొని ఒకరికి తెలియకుండా ఒకరిని ఇలా మొత్తం 11 మందిని వివాహం చేసుకున్నాడు.

బాధితుల్లో ఎక్కువమంది హైదరాబాద్‌‌కు చెందిన ఉన్నత విద్యావంతులు, ఉద్యోగాలు చేస్తున్నవారే. ఎట్టకేలకు ఈ ప్రబుద్ధుడు బాగోతాన్ని ఇద్దరు భార్యలు ఆధారాలతో సహా బయటపెట్టి తమను దారుణంగా మోసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించడంతో పాటు ఇంకెవరూ మోసపోకుండా చూడాలని బాధిత మహిళలు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ కోరుకున్నారు.