స్పూన్ సాయంతో జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు- హాలీవుడ్ సినిమాను మించిపోయారు

Prisoners who escaped from prison with the help of a spoon

0
81

ఖైదీలు జైలు నుంచి పారిపోయిన అనేక ఘటనలు మనం విన్నాం .అయితే కొన్ని సినిమాల్లో అయితే కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్న జైళ్ల నుంచి చిన్న చిన్న వస్తువుల సాయంతో పారిపోయిన సీన్లని చూశాం. సినిమాల్లో ఆసక్తిగా అనిపిస్తాయి కానీ నిజజీవితంలో అలాంటివి సాధ్యం కాదు అనుకుంటాం కాని ఇక్కడ ఇదే జరిగింది.

ఇజ్రాయెల్ లోని ఓ జైలు నుంచి ఖైదీలు సొరంగం తవ్వి దాని గుండా పారిపోయారు. వారు ఎలా ఎస్కేప్ అయ్యారో తెలిసి షాక్ అయ్యారు పోలీసులు. తుప్పు పట్టిన చెంచాలతో ఓ సొరంగాన్ని తవ్వి అందులో నుంచి పారిపోయినట్లుగా గుర్తించారు.
మొత్తం ఆరుగురు ఖైదీలు అని తెలిపారు. వీళ్లంతా గిల్బోవా జైల్లో ఒకే సెల్లో ఉండేవారు. ఓ సింక్ను ఆధారంగా చేసుకొని భారీ సొరంగం తవ్వి పారిపోయినట్లు జైలు అధికారులు గుర్తించారు.

అయితే వీరికి ఎవరైనా సాయం చేశారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. ఇంత మంది భద్రత ఉండగా వారు తప్పించుకోవడం అందరిని షాక్ కి గురిచేసింది. వీరు ముందు ఓ స్పూన్ సంపాదించారు. దానిని ఫోటో వెనుక పెట్టి సొరంగం తవ్వారు. ఈ ఖైదీల్లో నలుగు జీవిత ఖైదు వారు ఉన్నారు.