హైదరాబాద్ లో వ్యభిచారం కలకలం..ఇద్దరు హీరోయిన్స్ అరెస్ట్

0
118

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో వ్యభిచారం కలకలం రేపింది. రెండు వేర్వేరు హోటళ్లలో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయా హోటల్స్ పై దాడి చేసి ఇద్దరు హీరోయిన్స్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్లో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ముంబైకి చెందిన రిచా అనే నటిని, ఆమెతో పాటు ఆమెకి, విటులకి మధ్య బ్రోకర్ గా పని చేస్తోన్న మోనిష్ కడాకియాను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసులకి అప్పగించారు.

అలాగే తాజ్ బంజారా హోటల్లోనూ వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో హోటల్ పై దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు..రూమ్ నెంబర్ 402 నుంచి బెంగాలీ టీవీ నటి సుబ్ర చటర్జీ, విటుడు వెంకటేశ్వర రావుని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకి సంబంధించిన బ్రోకర్ జనార్థన్ పరారీలో వున్నట్టు పోలీసులు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం కేసు ప్రాథమిక దర్యాప్తులో వుందని, కేసు విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడించడం జరుగుతుందని పంజాగుట్ట సీఐ రవీందర్ రావు తెలిపారు.