పైకి మసాజ్ సెంటర్ లోపల అంతా వ్యభిచారం – 8 మంది అరెస్ట్

Prostitution in Massage centre

0
214

పేరుకి అది మసాజ్ సెంటర్ కాని అక్కడ చేసేది మాత్రం వ్యభిచారం. కొన్ని సెంటర్లలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందితే వెంటనే అక్కడ దాడి చేస్తున్నారు. వీరి గుట్టు రట్టు అవుతోంది. దేశ వ్యాప్తంగా ఇలాంటి మసాజ్ పార్లర్లు కొన్ని బయటపడుతున్నాయి. ఇక నగరంలో కూడా కొందరు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

బంజారాహిల్స్లోని ఓ మసాజ్ సెంటర్పై వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. మసాజ్ సెంటర్ మాటున అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే సమాచారం వచ్చింది. ఇక్కడ పోలీసులు వెళ్లి చూస్తే ఆరుగురు అమ్మాయిలు ఇద్దరు విటులు ఉన్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్నామని. దీని వెనుక ఎవరెవరు ఉన్నది తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. మసాజ్ సెంటర్ ముసుగులో ఇలాంటి పనులు ఎవరు చేసినా ఊరుకునేది లేదని కేసులు నమోదు చేస్తామని తెలియచేస్తున్నారు.