హైదరాబాద్ నడి బొడ్డున్న వ్యభిచారం – అడ్డంగా దొరికిన యువతులు

Prostitution in the Hyderabad -Young women's found

0
129

హైదరాబాద్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న వీఎంఆర్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పై పోలీసులు దాడి చేసారు. ఈ దాడిలో  ఇద్దరు యువతులు, ఇద్దరు నిర్వాహకులను ఆదివారం నాడు వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్‌ మురళీమోహన్‌ సమాచారం మేరకు… హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పక్కనే  వనస్థలిపురం సుష్మాసాయినగర్‌ కాలనీ పరిసరాల్లో వీఎంఆర్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఉంది. అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో బార్‌ పై ఇన్‌స్పెక్టర్‌ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు.

బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న వి.అజయ్‌ (22), సెక్యూరిటీ గార్డు సుగమ బాగర్‌(35) ఆర్గనైజర్లుగా వ్యవహరిస్తూ యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. వీఎంఆర్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో కస్టమర్ల కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు యువతులను పట్టుకొని రెస్క్యూ హోంకు తరలించారు. ఇద్దరు ఆర్గనైజర్లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. వారి నుంచి కొంత నగదు, నాలుగు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ వార్త కూడా చదవండి….

Breaking News : రేవ్ పార్టీలో పట్టుబడిన దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నలుగురు అమ్మాయిలు