ఆఫ్ఘనిస్తాన్ లో రెచ్చిపోతున్న తాలిబ‌న్లు – మ‌హిళ‌లు కన్నీటి ప‌ర్యంతం

Provoking Taliban in Afghanistan

0
74

ఆఫ్ఘనిస్తాన్ లో మ‌ళ్లీ తాలిబ‌న్లు రెచ్చిపోతున్నారు. ఇక్క‌డ నుంచి అమెరికా సైన్యం వెనుదిరిగిన‌ ఎంట‌నే వీరి ఎంట్రీ మొద‌లైంది.
దేశంలో స‌గానికి పైగా ప్రొవిన్షియల్ రాజధానులను స్వాధీనం చేసుకొని కాబుల్ నగరం వైపు పయనిస్తున్నారు. అంతేకాదు వారు కాలుమోపిన చోట అనేక క‌ఠిన‌మైన షరియత్ చట్టాలను విధిస్తున్నారు. అక్క‌డ ఉండే మైన‌ర్ బాలిక‌లు మ‌హిళ‌లు ఈ చ‌ట్టాల‌తో ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు.

ఇంటింటికి తీరుగుతూ బాలికల వివరాలను సేకరిస్తున్నారు. వివాహం కాని వారి పేర్లు డీ టెయిల్స్ అన్నీ సేక‌రిస్తున్నారు.
తాలిబాన్లకే ఇచ్చి అమ్మాయిల‌ను పెళ్లి చేయాలంటూ కోరుతున్నారు. అమ్మాయిల‌ని స్కూళ్ల‌కు పంప‌ద్ద‌ని ఇంట్లో ఉంచాలి అని హుకూం జారీ చేశారు.

ఈ క‌ఠిన చట్టాల‌తో దాదాపు 3 లక్షలమంది ఆఫ్ఘానిస్తాన్‌ను వదిలి వేరే దేశాలకు పయనమయ్యారట‌. చాలా మంది బాలిక‌లు మ‌హిళ‌లు వేరే ప్రాంతాల‌కు వెళ్లిపోతున్నారు. తాలిబ‌న్లు అధికారం చేప‌డితే ఇక మేము ఇళ్ల‌కే ప‌రిమితం అవుతాం అత్యాచారాలు పెరుగుతాయి. మా పిల్ల‌ల‌ను కూడా వారు వ‌దిలిపెట్ట‌ర‌ని క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు. ఇప్ప‌టికే కొంద‌రు తాలిబ‌న్లు 12 ఏళ్లలోపు బాలికలను బలవంతంగా పెళ్లి చేసుకుని వారిని లైంగిక బానిసత్వంలోకి నెట్టడానికి ఇంటింటికి తిరిగి వారిని వెతుకుతున్నారు. తాలిబ‌న్లు స్థానిక ఇమామ్‌లకు ఈ మ‌హిళ‌ల జాబితా తీసుకురావాలి అని హుకూం జారీ చేశారు.