ఒడిశా రాష్ట్రంలోని ఎంతో ప్రముఖ పుణ్య క్షేత్రం పూరీ జగన్నాథుని ఆలయం. ఈ ఆలయం చివరి దేవదాసి పారస్మణి దేవి ఆదివారం కన్నుమూశారు. వృద్ధాప్యంలో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆమె నేడు తుదిశ్వాస విడిచారు.
శ్రీ జగన్నాథ ఆలయానికి చివరి దేవదాసిగా ఉన్న పారస్మణి మరణంతో ఈ సంప్రదాయం ఇక ముగిసింది.
శ్రీ జగన్నాథ ఆలయంలో స్వామి వారి ఎదుట పాటలు పాడుతూ నృత్యం చేసేవారు. పారస్మణి ఆలయంలో సేవలు అందించడమే కాకుండా, ఎన్నో ఆధ్యాత్మిక చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా రేడియో కళాకారిణిగా ఒడిస్సీలో జగన్నాథుడికి సంబంధించిన పాటలు పాడుతూ ప్రసిద్ధి చెందారు. ఎనిమిది దాశాబ్ధాలుగా జగన్నాధుని ఆలయంలో సేవలందించారు.
ఆమె 2010 నుంచి సేవలకు దూరమయ్యారు. కానీ పారస్మణి గత పదేళ్ల నుంచి ప్రతిరోజూ భగవంతుడి కోసం గీత గోవిందను పఠిస్తూ ఉండేవారు. ఆమె 11 ఏళ్ల ప్రాయం నుంచి భగవంతుడికి సేవలందిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆమెని చివరి చూపు చూసేందుకు వచ్చారు అక్కడ జనం అధికారులు.