కొంప ముంచిన ఫ్రెండ్షిప్.. రూ.కోటి 60 లక్షల మోసం

-

ఈజీగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో కొందరు యువకులు భారీ మోసానికి తెరలేపారు. వ్యసనాలకు అలవాటై మోసాలకు పాల్పుడుతున్న ఐదురుగు నిందితులను రాచకొండ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. అన్సారీ, ముర్షీద్, వికాస్ సింగ్‌తోపాటు మరో వ్యక్తి కలిసి గతంలో నకిలీ కాల్ సెంటర్‌లో పనిచేశారు. అనుభవం వచ్చాక ఘాజియాబాద్‌లో సొంతంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. మరో ముగ్గురిని టెలీ కాలర్స్‌ను నియమించుకున్నారు. డబ్బు చెల్లించి ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నవారి వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే రాచకొండ పరిధిలో ఉంటున్న ఓ రిటైర్డ్ ఉద్యోగి వివరాలు కనుక్కొని ఫోన్ చేసి విసిగించడం ప్రారంభించారు.

- Advertisement -

ఇప్పటికే మీరు తీసుకున్న పాలసీపై భారీ లబ్ది చేకూరుస్తామని నమ్మించారు. కోట్ల రూపాయల నకిలీ డీడీల ఫోటోలు చూపించారు. అతని సాయంతో మరికొందరు అతని మిత్రులను ఉచ్చులోకి లాగి.. జీఎస్టీ కట్టాలని నమ్మించారు. ఇలా 2016 నుంచి 2022 వరకు సదరు రిటైర్డ్ ఉద్యోగితో పాటు అతను పరిచయం చేసిన వారి నుంచి దఫా దఫాలుగా రూ.కోటి 60 లక్షలు లాగాడు. ఆ తర్వాత మోస పోయామని గ్రహించిన బాధితులు రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also:
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితులకు బెయిల్ నిరాకరణ

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...