జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం..11 మంది విద్యార్థుల సస్పెండ్

0
108

ఏపీ: కాకినాడ ​జేఎన్​టీయూలో ర్యాగింగ్​ కలకలం రేపింది. మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థిని ఇంటరాక్షన్ పేరిట ర్యాగింగ్ చేసినట్టు యూజీసీ యాంటీ ర్యాగింగ్ వెబ్​సైట్​కు ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదుపై విశ్వవిద్యాలయం యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ చేపట్టింది.

ఈ ర్యాగింగ్‌ చేసింది నిజమేనని తెలియడంతో ఇద్దరు మొదటి ఏడాది, 9 మంది తృతీయ సంవత్సరం విద్యార్థులను మొత్తం 11 మంది విద్యార్ధులను రెండు నెలల పాటు హస్టల్ నుండి, 15 రోజుల పాటు క్లాస్ ల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి ప్రసాదరాజు తెలిపారు.