Ramachandra bharathi re- arrested in MLA’s Poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతి మరోసారి అరెస్ట్ అయ్ పోర్ట్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు ఆయనను గురువారం అరెస్టు చేశారు. అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
ఫామ్ హౌజ్ కేసులో అరెస్టైన ఆయన బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, రెండు వేర్వేరు చిరునామాలతో పాస్‌పోర్టు ఉదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో అతని ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఫోర్జరీ సంతకలతో నకిలీ పత్రాలు సమర్పించి పాస్ పోర్టులు పొందినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. దీంతో ఆయనను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్ మేరకు చంచల్ గూడ జైలుకు తరలించారు.