Breaking News: ఏపీలో దారుణం

0
91

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని తొమ్మిదేళ్ల చిన్నారిపై  ఓ నీచుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..కొత్తచెరువులో ఆర్ఎంపి ఆదినారాయణ ఓ క్లినిక్ నడిపిస్తున్నాడు. తమ పాపకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఆదినారాయణ క్లినిక్ కు తీసుకెళ్లారు. అక్కడే సహాయకునిగా పని చేస్తున్న జయరామ్ పాపకు ఇంజక్షన్ చేయాలని తల్లిని బయటకు పంపించి అత్యాచారం చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.