మ‌హిళ‌పై అత్యాచారం – కేసు వెన‌క్కి తీసుకోనందుకు దారుణం

Rape of a woman - The case is atrocious for not being withdrawn

0
139

రాజస్థాన్ లో దారుణమైన ఘ‌ట‌న జ‌రిగింది.సిరోహి జిల్లాకు చెందిన నేత్రమ్, బాధిత మహిళ ఇరుగుపొరుగు వారే.గ‌త ఏడాది నేత్ర ఇంటి ఎదురుగా ఉన్న మ‌హిళ‌పై అత్యాచారం చేశాడు. ఆమె ఫిర్యాదు మేర‌కు పోలీసులు అత‌న్ని అరెస్ట్ చేశారు. కొద్ది నెల‌ల త‌ర్వాత అతడు బెయిల్ పై బయటికి వచ్చాడు. ఇక బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యం నుంచి ఆమెని వేధించ‌డం మొద‌లుపెట్టాడు.

ఈ కేసు వెన‌క్కి తీసుకోవాలి అని చాలా దారుణంగా టార్చ‌ర్ పెట్టాడు. చివ‌ర‌కు ఓ మహిళ వేషంలో వచ్చి ఆమె ప్రాణాలు తీశాడు.ఆమెపై కక్ష పెట్టుకుని, ఆమె కేసు వెన‌క్కి తీసుకోవ‌డం లేద‌ని ఇంత దారుణం చేశాడ‌ని తెలుస్తోంది. ఆమెకి పెళ్లి కూడా అయింది. ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఆమె మ‌ర‌ణంతో ఆ కుటుంబం రోడ్డున ప‌డింది.

భ‌ర్త లేక‌పోవ‌డంతో చెల్లెలుతో కలిసి నివసిస్తోంది ఈ మ‌హిళ‌. గత రాత్రి ఎవరూ తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు ఓ మహిళ వేషంలో ఆమె ఇంటిలోకి వ‌చ్చాడు. ఆమెపై క‌త్తితో దాడి చేసి చంపేశాడు. అంతేకాదు అడ్డు వ‌చ్చిన ఆమె చెల్లిపై కూడా క‌త్తితో దాడి చేశాడు. పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు.