రేషన్ డీలర్ వీరంగం..ప్రభుత్వ ఉద్యోగుల కళ్లల్లో కారం కొట్టి..

The ration dealer who hit the pepper in the eyes of government employees..what actually happened?

0
84

ఆంధ్రప్రదేశ్‌లో ఓ మహిళా రేషన్‌ డీలర్ వీరంగం సృష్టించింది. నా పుట్టలో వేలు పెడితే నేను ఊరుకుంటానా అంటూ పోలీసులకు, రెవెన్యూ అధికారులకు, విలేజ్ సెక్రటేరియట్ ఉద్యోగులకు చుక్కలు చూపించింది.

తూర్పుగోదావరి జిల్లా నడురబడ గ్రామంలో రేషన్ షాపును స్వాధీనం చేసుకోవడానికి రామచంద్రాపురం ఆర్డీవో సింధు ప్రయత్నించారు. రెవెన్యూ అధికారులు, గ్రామ సచివాలయ ఉద్యోగులతో కలిసి దుకాణం స్వాధీనం కోసం వచ్చారు. డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు కూడా తీసుకున్నారు. కానీ, దుకాణాన్ని స్వాధీనం చేసేందుకు మహిళా రేషన్ డీలర్ మిర్తిపాటి జ్యోతి ససేమిరా అంది. ఎంత నచ్చజెప్పినా ఇచ్చేది లేదంటూ ఎదురు దాడికి దిగింది.

చేసేదిలేక ఇంటి గేటు పగలగొట్టాలంటూ ఆర్డీవో సింధు ఆర్డర్ ఇచ్చింది. అంతే రేషన్ డీలర్ జ్యోతి రెచ్చిపోయింది. తన ఇంటి గేటును తీసేందుకు ప్రయత్నించిన అధికారుల కళ్లల్లో కారం కొట్టి రాడ్డుతో అటాక్ చేసింది. తనకు 2025వరకు హక్కుందని డీలర్ జ్యోతి వాదించింది.

రేషన్ డీలర్ అటాక్‌లో ఇద్దరు మహిళా పోలీసులకు, సచివాలయ ఉద్యోగికి, వాలంటీర్‌కు గాయాలు అయ్యాయి. కళ్లల్లో కారం పడటంతో విలవిల్లాడిపోయారు. డీలర్ జ్యోతి ఎదురు దాడితో ఏం చేయాలో పాలుపోక సతమతమయ్యారు అధికారులు. ఈ-పోస్, వేయింగ్ మిషన్‌, సరకులు అప్పగించేందుకు డీలర్ జ్యోతి నిరాకరించడంతో చేసేదేమీలేక అధికారులు, పోలీసులు వెనుదిరిగారు.