Flash: పబ్‌లో రేవ్ పార్టీ..బిగ్ బాస్ విన్నర్ తో సహా 150 మంది అరెస్ట్

0
79

బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో రేవ్ పార్టీని నిర్వహిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పక్క సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఫుడింగ్ మింక్ పబ్‌పై  ఒక్కసారిగా దాడులు చేసారు. ఈ సందర్భంగా 150 మంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారిని బంజారా హీల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ రేవ్ పార్టీలో రాహుల్ సిప్లిగంజ్, నిహారిక తో పాటు మరి కొంతమంది సెలెబ్బ్రేటీస్ ఉన్నట్లు సమాచారం. 39 మంది యువతులు ఉన్నారని పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది. దాంతో హైదరాబాద్‌లో భారీ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.