ఇద్దరూ ప్రేమించుకున్నారు – ప్రియుడ్ని కాదని వేరే వ్యక్తితో పెళ్లికి రెడీ అయింది – చివరకు దారుణం

Ready to marry someone other than lover

0
89

కొన్ని జంటలు ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు కాదు అంటే చివరకు పారిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంకొందరు ఒకరిని ఒకరు హత్య చేసేంత వరకూ వెళుతున్నారు. ఇలాంటి దారుణ ఘటనలు ఈ మధ్య మనం వింటున్నాం.

కొన్ని సంవత్సరాలుగా యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరిగారు. సినిమాలు విహరయాత్రలు ఇలా చాలా చోట్లకి ఈ ప్రేమ జంట వెళ్లింది. వివాహం చేసుకుందాం అని అనుకున్నారు. కానీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంట్లో చూసిన యువకుడితో కొన్ని నెలల క్రితం యువతి నిశ్చితార్థం జరిగిపోయింది. ఆ యువకుడు జీర్ణించుకోలేకపోయాడు.

ఆమెకి చాలా సార్లు చెప్పాడు నువ్వు పెద్దలు చూసిన పెళ్లి చేసుకోవద్దు నాతో వచ్చెయ్ సంతోషంగా ఉందాం అన్నాడు. కానీ ఆమె మాత్రం ఇంట్లో చూసిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. చివరకు ఆమె ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో ఆమెని కత్తితో పొడిచి చంపేశాడు. అదే కత్తితో తను పొడుచుకున్నాడు ఆమె మరణించింది. అతనికి తీవ్రగాయాలై ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.ఈ ఘటన ఒక్కసారిగా అందరిని షాక్ కి గురిచేసింది.