Flash: రియ‌ల్ట‌ర్ల హ‌త్య కేసు..ఆరుగురు అరెస్ట్

0
74

ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును పోలీసులు చేధించారు. ఈ కాల్పుల ఘ‌ట‌నలో ఉన్న మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అశోక్ రెడ్డి అలియాస్ ఇంద్రసేనారెడ్డి అని రాచ‌కొండ సీపీ మ‌హేష్ భ‌గ‌వ‌త్ తెలిపారు. అలాగే అక్క‌డి గెస్ట్ హౌస్ లో పని చేస్తున్న ఖాజా మొయినుద్దీన్, భిక్షపతి, సయ్యద్ రహీమ్, షబ్బీర్ అలీ, రాజివ్ ఖాన్ లను అరెస్టు చేశామ‌ని తెలిపారు. ఇద్ద‌రు రియ‌ల్ట‌ర్ల‌పై కొంత మంది దుండ‌గులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. కాగా ఈ కాల్పుల్లో ఇద్దరు రియ‌ల్ట‌ర్లు మృతి చెందారు.