Flash: చావులోనూ వీడని అన్నదమ్ముల బంధం..

0
102

అన్నదమ్ముల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ప్రస్తుతరోజుల్లో భూముల విషయాల్లో, ఇంటివిషయాలల్లో చిన్న చిన్న కలహాలు వచ్చి మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ తెలంగాణాలోని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో అన్నదమ్ముల అనుబంధాన్ని లోకానికి మరోసారి చాటిచెప్పారు.

లక్షెట్టిపేట పట్టణానికి చెందిన గాజుల భాస్కర్ గౌడ్ గుండెపోటుతో మరణించాడు. తమ్ముడి మృతదేహాన్ని చూసి అన్నయ్య జీర్ణించుకోలేక అతను కూడా గుండెపోటుతోనే మరణించి కుటుంబసభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చారు. దాదాపు 50 ఏళ్లపాటు తనతో కలిసి పెరిగిన తమ్ముడు మరణించడంతో తట్టుకోలేక అన్న హృదయం ఒక్కసారిగా ఆగిపోయి మరణించడం జరిగింది.

తమ్ముడిని మళ్ళి చూడాలేమోనని బయపడి గుండెపోటుతో మరణించి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కరోజులేనే గుండెపోటుతో అన్నదమ్ములిద్దరూ మృతి చెందడంతో బంధువులు, కుటుంబ సభ్యులు రోదనకు గురయ్యారు. ఈ హృదయవిదారక ఘటన చూస్తే ఎవ్వరైనా కంటతడి పెట్టుకోవాల్సిందే.