బ్రేకింగ్: రిమాండ్ ఖైదీ రాములు మృతి.. జైలు సిబ్బంది కారణమంటున్న బంధువులు

0
95

తెలంగాణాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లాల్లోని రిమాండ్ ఖైదీ భేటీ రాములు మెదక్ సబ్ జైల్లో మృతి చెంది వారి కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చాడు. ఈనెల 2న హత్యాయత్నం కేసులో రాములును అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌‌కు తరలించారు. కాగా, రాములుకు ఒక్కసారిగా ఛాతినొప్పి రావడంతో  ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గం మధ్యలోనే మృతి చెందాడు. కానీ ఈ ఘటనకు పోలీసులు కొట్టడమే కారణమని బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.