బ్రేకింగ్: తెలంగాణలో రిపోర్టర్ కిడ్నాప్ కలకలం

0
92

తెలంగాణలో ఓ రిపోర్టర్ కిడ్నాప్ ఇప్పుడు కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో రామ్ ప్రసాద్ అనే రిపోర్టర్ ఇంటి వద్ద నుంచి పోలీసులమని చెప్పి  గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల కిందటే తీసుకెళ్లారు. ఇంతకూ రాంప్రసాద్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. నల్లగొండ డిటీసీకి తీసుకెళ్లి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాంప్రసాద్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు కూడా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.