ప్రియుడిపై రివేంజ్ – తాను కొనిచ్చిన బైక్ ని ఏం చేసిదంటే -వీడియో చూడండి.

Revenge on her Lover- Viral Video

0
118

అమ్మాయిలను ప్రేమిస్తే ఆ వ్యక్తిని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటారు. కానీ మోసం చేస్తే మాత్రం అతని ప్రాణమైన తీస్తారు. లైలా మజ్ను, పారు దేవదాసు లాంటి ప్రేమికులని చూశాం. ఇప్పుడు మాత్రం ప్రేమికులు తమని కాదు అంటే ఏకంగా వారిని చంపేందుకు కూడా సిద్దం అవుతున్న ప్రేమికులని చూస్తున్నాం.

బ్యాంకాక్ లో జరిగిన ఓ ఘటన దేశంలో అందరూ షాక్ అయ్యేలా చేసింది. ఇది ఏకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాజీ బాయ్ ఫ్రెండ్పై ప్రతీకారం తీర్చుకునేందుకు తాను అతడికి బహుమతిగా ఇచ్చిన బైక్ను మహిళ దగ్ధం చేసింది. బ్యాంకాంక్లోని స్కూల్ పార్క్లో టూ వీలర్పై మహిళ కనోక్ వాన్ పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఇలా ఎందుకు చేసింది అంటే, తన ప్రియుడు తనని మోసం చేశాడని ఇలా ప్రతీకారం తీర్చుకుంది.

తిరిగినంత కాలం తిరిగి చివరకు పెళ్లి చేసుకోమంటే నో అన్నాడు. అతనిపై పగతో ఆమె కొనిచ్చిన 27 లక్షల రూపాయల బైక్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. అతని బైక్ తో పాటు ఆ పక్కన ఉన్న ఆరు బైక్ లు కూడా అంటుకున్నాయి. దీంతో పోలీసులు సీసీటీవీ పరిశీలిస్తే ఆమె అని తేలింది. మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.