BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది దుర్మరణం

0
99

ఉత్తర్​ప్రదేశ్​ ​లో ఘోర రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. పీలీభీత్లోని గజ్రౌలా పోలీస్​ స్టేషన్​ పరిధిలో.. పికప్​ ట్రక్కు చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో  10 మంది మరణించారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మొత్తం 18 మంది హరిద్వార్​లో స్నానం చేసి తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తుంది.