కుళ్లిన మృతదేహం కలకలం..హత్యా..ఆత్మహత్యా?

Rotten corpse shaken..killed..suicide?

0
80

తెలంగాణలో కుళ్లిపోయిన మృతదేహం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధి కొంగరకలాన్ గ్రామ అటవీ ప్రాంతంలో కుళ్ళిపోయిన మృతదేహం లభ్యం అయింది. సుమారుగా 10 రోజుల క్రితమే ఆ వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎవరైనా హత్య చేశారా లేక తానే ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.