ఫ్లాష్: అదుపుతప్పిన ఆర్టీసీ బస్..25 మందికి గాయాలు

0
89

బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి నిజామాబాద్‌ వెళ్తుండగా పాత కలెక్టరేట్‌ ఎదుట అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉండగా.. 25 మందికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణహాని జరగలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.