సెంట్రల్ ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి. వినిట్సియా నగరమే లక్ష్యంగా క్షిపణులతో భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడిలో 23 మంది మృతి చెందగా..100 మందికి గాయాలయ్యాయి. తాజా దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేయడం ఉగ్రచర్యేనని పేర్కొన్నారు.