నిండు ప్రాణాన్ని బలిగొన్న ఆన్ లైన్ అప్పు

0
73

కడియంలో లోన్ యాప్ సంస్థల వేధింపులు భరించలేక ఓ నిండు ప్రాణం బలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..కోనా సతీష్ అనే యువకుడు లోన్ తీసుకున్నాడు. తిరిగి చెల్లించాలంటూ నిర్వాహకుల నుంచి ఒత్తిడి నెలకొంది. నగ్నంగా ఉన్న ఫోటోలకు సతీష్ తల అంటించి సోషల్ మీడియాలో  యాప్ నిర్వాహకులు ప్రచారం చేశారు. దీనితో మానసిక క్షోభకి గురై రెండు రోజుల క్రితం భీమవరంలో ట్రైన్ కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఫోన్ కి వస్తు బెదిరింపులు గురి చేయడంతో అసలు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.