పోలీసులను ఆశ్రయించిన ‘నువ్వే కావాలి’ సినిమా ఫేమ్ సాయి కిరణ్..కారణం ఇదే!

0
120

డబ్బు వసూలు చేసి మోసం చేసిన నిర్మాతలపై ‘నువ్వే కావాలి’ సినిమా ఫేమ్ సాయి కిరణ్ పోలీసులను ఆశ్రయించారు. మన్న మినిస్ట్రీస్ లో సభ్యత్వం పేరుతో నా దగ్గర 10.6 లక్షలు వసూలు చేశారు. అయితే నాకు సభ్యత్వం కల్పించకపోగా..నిర్మాత జాన్ బాబు , లివింగ్ స్టెన్ డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని సాయి కిరణ్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. సాయి కిరణ్ ఫిర్యాదుతో జాన్ బాబు, లివింగ్ స్టెన్ లపై 420,406 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.