సూసైడ్ చేసుకున్న సమంత..భర్తతో గొడవే కారణం!

0
81

రోజురోజుకు ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోంది. చిన్న చిన్న కారణాలకు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఏపీలోని మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని వివర్స్ కాలనీకి చెందిన కందుల సమంత ఫేస్ బుక్ లో తణుకుకు చెందిన నవీన్ తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో ఆషాడ మాసం కావడంతో సొంత ఊరు మంగళగిరికి వచ్చింది సమంత. ఐతే ఏదో విషయంలో భర్త నవీన్ తో చరవాణిలో పలుమార్లు గొడవ పడింది సమంత.  దీనితో గత రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.