షాకింగ్ న్యూస్ : టిఆర్ఎస్ ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు

0
81

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీకి పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. ముప్పేట వత్తిడి కారణంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేపైనే పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేయడం సంచలనం రేకెత్తించింది. అది కూడా.. ఆయన అలాంటి ఇలాంటి ఎమ్మెల్యే కాదు… ఏకంగా వెలమ కులానికి చెందిన ఎమ్మెల్యే కావడం గమనార్హం. సిఎం కేసిఆర్ సొంత కులానికి చెందిన ఎమ్మెల్యే మీద అట్రాసిటీ కేసు నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో ఒక కుదుపు కుదిపింది. పూర్తి వివరాలు…

మల్కాజిగిరి టీఆరెస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పై మంగళవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. దుల్లాపల్లి లోని మైనంపల్లి ఇంటి దగ్గర జరిగిన వ్యవహారంలో ఈమేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

ఈనెల 17 వ తేదీన మైనంపల్లి ఇంటిదగ్గరికి వెళ్లిన దళిత మహిళల పై అసభ్య ప్రవర్తనకు పాల్పడినట్లు మైనంపల్లి మీద సదరు మహిళలు ఆరోపించారు.

అలాగే బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశం గురించి అడగడానికి వెళ్లిన దళిత మహిళల పై దాడి చేసి దుస్తులు చింపినట్లు మైనంపల్లి పై ఆరోపణలు వెల్లువెత్తాయి.

మైనంపల్లి తనను ఇంటి లోపలికి తీసుకెళ్లి రేప్ చేయబోయాడంటూ మహిళ జజల రమ్య ఫిర్యాదు చేశారు. రమ్య ఫిర్యాదు పై 354, SEC3(1) (s) SC/ST(POA) act 1989 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మైనంపల్లి కేరాఫ్ అడ్రస్ గా ఇటు బిజెపి, అటు టిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం, తోపులాటల పోరాటం కాస్తా ఇప్పుడు కేసుల దాకా వెళ్లింది. నెక్ట్ ఏం జరగనుందో అన్నది ఉత్కంఠ రేపుతోంది.