ఉత్తరప్రదేశ్ చిన్నారులు ఓ వ్యాధి బారిన పడి 8 మంది ప్రాణాలు విడిచారు. దీనిని స్క్రబ్ టైఫస్ గా వైద్యులు చెబుతున్నారు. మొత్తం పది మంది మరణిస్తే అందులో 8 మంది చిన్నారులు ఉన్నారు. దీంతో ఆ కుటుంబాలు కన్నీటి పర్యంతం అయ్యాయి.
అయితే ఈ వ్యాధి ఎలా వస్తుంది అంటే వైద్యులు కొన్ని విషయాలు చెబుతున్నారు. చిగ్గర్స్ అనే పురుగు కుట్టడం వల్ల ఇది వ్యాపిస్తుందని తెలిపారు వైద్యులు.
మధుర జిల్లాలోని కోహ్ గ్రామంలో 26 మంది, పిప్రోత్లో ముగ్గురు, రాల్లో 14 మంది, జసోడాలో 17 మంది ఈ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. దీని గురించి వైద్యులు ఏమంటున్నారంటే ఓరియెంటియా త్సుత్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుంది. చిగ్గర్స్ అనే పురుగుకాటు ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది.
వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే?
ఈ వ్యాధి సోకినవారిలో 10 రోజుల వరకు తీవ్రమైన జ్వరం, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, శరీరంపై దద్దర్లు చిన్న చిన్న పొక్కులులాంటివి వస్తాయి. శరీరం మంట వస్తుంది. చెట్ల పొదలు గుబుర్లుగా ఉండే మొక్కల దగ్గరకు వెళ్లవద్దు అంటున్నారు నిపుణులు .చిగ్గర్స్ ఎక్కువగా చెట్ల పొదల్లో ఉంటాయని చెబుతున్నారు.